మహబూబాబాద్ పట్టణంలో రోజురోజుకు పందులు, కుక్కలు, కోతుల బెడద ఎక్కువ అవుతున్న దృష్ట్యా వాటి నివారణ చర్యలు కోసం మహబూబాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిలర్లతో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పట్టణంలో పందులను వేరే ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో పందుల యజమానులు వచ్చి అడ్ఢుకోవడం జరుగుతుందని కావున స్థానిక కౌన్సిలర్ల సహకారంతో తరలించుటకు చర్చించామన్నారు. అలాగే పట్టణంలో కుక్కలు పెరగకుండా ఇప్పటివరకు ఏ బి సి సెంటర్ లో 3452 కుక్కలకు ఆపరేషన్ చేస్తున్నామన్నారు. ఆపరేషన్ అనంతరం కుక్కలను ఎక్కడపడితే అక్కడ వదిలేయకుండా ఒకచోట ఉంచేవిధంగా ఏర్పాట్లు చేసి ఈమేరకు సమీక్షించారు. కోతులను పట్టణం నుండి అటవీ ప్రాంతాలకు తరలించేందుకు కోతులను పట్టే వారిని పిలిపించి తరలించే ఏర్పాట్ల కొరకు కౌన్సిలర్లతో చర్చించారు. ఈ సమావేశంలో DE ఉపేందర్, ప్లోర్ లీడర్లు అజయ్ సారధి, సూర్ణపు సోమయ్య, వార్డు కౌన్సిలర్లు గుగులోత్ బాలునాయక్, పోతురాజు రాజు, మార్నేని శ్రీదేవి, విజయమ్మ, హరిసింగ్, జగన్, కో ఆప్షన్ సభ్యులు నిమ్మల శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.