Sunday, October 6, 2024
HomeతెలంగాణMahabubabad: సురక్షా దినోత్సవ వేడుకల్లో సత్యవతి రాథోడ్

Mahabubabad: సురక్షా దినోత్సవ వేడుకల్లో సత్యవతి రాథోడ్

కేసీఆర్ సర్కారు . పోలీసు శాఖకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తోంది- మంత్రి సత్యవతి రాథోడ్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన “సురక్షా దినోత్సవ వేడుకలలో” భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో పెట్రోలింగ్ కార్లు, బ్లూ కోర్స్ వాహనాలు-అగ్నిమాపక వాహనాలతో భారీ ర్యాలీని రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్, ఐటి కోర్ అండ్ సైబర్ సెల్ ను మంత్రి పరిశీలించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ….. పోలీసులకు సురక్షా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్ర పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, సీఎం కేసీఆర్‌ పారదర్శక పాలనలో పోలీసులు ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పర్చుకొని వారి సమస్యలు పరిష్కరించడంలో విజయం సాధిస్తున్నారన్నారు.

గడిచిన 9 ఏండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసుతో పాటు పోలీసు శాఖలలో అనేక సంస్కరణలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పిస్తుంది. మహిళలకు షీటీమ్స్‌తో భద్రత కల్పిస్తున్నారు. పోలీసు శాఖకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నారని, పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని త్వరగా కేసులు ఛేదిస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి గారితో పాటు జడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోత్ బిందు, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు, శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, ఎంపీ మాలోత్ కవిత, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక,ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News