Wednesday, February 12, 2025
HomeతెలంగాణMahabubnagar-MLA Yennam on ground: ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం

Mahabubnagar-MLA Yennam on ground: ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన పలు కాలనీలలో తిరిగి లోతట్టు ప్రాంతాలు పరిశీలించారు.గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎర్రగుంట చెరువు అలుగు పారి క్రింది ప్రాంతాలకు నీరు అధికంగా వస్తుండడంతో గోల్ మజీద్ ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు జలమయం అయ్యింది.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని అధికారులను ఆయన ఆదేశించారు.

- Advertisement -

లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఇండ్లల్లో నీరు రావడం తో ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, కౌన్సిలర్ జలీల్, వేద వ్రత్, పాషా సిరాజ్ ఖాద్రి, లక్ష్మణ్ యాదవ్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News