Saturday, April 12, 2025
HomeతెలంగాణMahabubnagar MLC Bipolls: ప్రారంభమైన మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

Mahabubnagar MLC Bipolls: ప్రారంభమైన మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

కొనసాగుతున్న పోలింగ్

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. దీనికోసం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో 10 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా పురపాలక సంఘాల కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జడ్పీ టీసీ సభ్యులు, ఎక్స్‌అఫీషి యో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. మొత్తం 1,439 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద వెబ్‌ కాస్టింగ్‌, వీడియోగ్రాఫర్ల ద్వారా ఎన్నికల అధికారులు ఓటింగ్‌ సరళిని పరిశీలిస్తారు. ఓటింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను మహబూబ్‌నగర్‌ బాలుర జూనియర్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూంలో భద్రపరచనున్నారు. ఏప్రిల్‌ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోటీలో బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీ పడుతున్నారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News