హోంమంత్రి మహమూద్ అలీ ఖమ్మం బురహాన్ పురంలోని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నివాసాన్ని సందర్శించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యేందుకు మంత్రి ఖమ్మం విచ్చేయగా, రవిచంద్ర ఆహ్వానం మేరకు వారి నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మంత్రి మహమూద్ అలీకి పుష్పగుచ్ఛమిచ్చి ఆత్మీయ స్వాగతం పలికారు, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజుతో కలిసి మంత్రి అలీ గీటురాయి మాస పత్రికను ఆవిష్కరించారు. పలువురు ముస్లిం ప్రముఖులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.