హీరో అల్లు అర్జున్(Allu Arjun)పై కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి కక్ష లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. బన్నీ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Chandrasekhar Reddy) గాంధీ భవన్ రావడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ వచ్చిన విషయం తనకు తెలియదని చెప్పారు. చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్‌కు వచ్చిన సమయంలో మీడియా సమావేశంలో ఉన్నానని తెలిపారు. దీంతో ఆయన కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీని కలిశారని.. ఆమెతో ఆయనకు పరిచయం లేదన్నారు. అందుకే తొందరగా మాట్లాడి వెళ్లిపోయారని క్లారిటీ ఇచ్చారు.
ఈ విషయం తెలిసిన వెంటనే తాను ఆయనకు ఫోన్ చేశానని ఒకట్రెండు రోజుల్లో కూర్చొని మాట్లాడుకుందామని చెప్పానని తెలిపారు. అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నేత అని, ఆయన తనకు ఎప్పటి నుంచో మంచి స్నేహితుడు అని వెల్లడించారు. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వ్యవహారం రోజురోజుకు పెద్దది అవుతోంది. ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్‌గా పరిస్థితి మారిపోయింది. ఈ క్రమంలో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ నేత అయిన బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వంతో రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు.