Friday, April 4, 2025
HomeతెలంగాణMaheshkumar Goud: కేటీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదు

Maheshkumar Goud: కేటీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదు

మహేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ & టీపిసిసీ కార్యనిర్వహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అహంకార ఇంకా తగ్గలేదన్న మహేష్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ముందే ప్రకటిస్తే 35 సీట్లు రావంటూ మాట్లాడటం కెటిఆర్ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అని ముందే ప్రకటిస్తే కెసిఆర్ తో పాటు కేటీఆర్ ఆయన బావ కూడా గెలిచే వారు కాదని ఆయన తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థి కావడం వల్లే.. అప్పటి సీఎం కేసీఆర్ పై పోటీ చేశారని స్పష్టంచేశారు మహేష్ కుమార్ గౌడ్.

- Advertisement -

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బి. ఆర్ .ఎస్. కు ప్రజలు మళ్ళీ బుద్ది చెపుతారన్న ఆయన, ఇచ్చిన మాట ప్రకారం 100రోజుల్లో అన్ని గ్యారంటీ లుఅమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో నిజమైన ప్రజా పాలన అందిస్తుంది సీఎం రేవంత్ సర్కారే అంటూ, కేటీఆర్ కవిత మాదిరి పేమెంట్ సిట్ రేవంత్ రెడ్డిది కాదు, రేవంత్ రెడ్డి రైతు బిడ్డ అంటూ చెప్పుకొచ్చారు. పనికిరాని, ఆచరణకు సాధ్యం కానీ కాలేశ్వరం కట్టి వేల కోట్లు దోచుకున్నారని, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు పట్టం కట్టడం ఖాయమన్నారు మహేష్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News