Thursday, July 4, 2024
HomeతెలంగాణMahila Congress meeting: మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యుటివ్ మీటింగ్

Mahila Congress meeting: మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యుటివ్ మీటింగ్

మహిళా కాంగ్రెస్ లోకి వలసలు

స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు అధ్యక్షతన గాంధీభవన్ ఇంద్రభవన్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది.

- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం చాలా సంతోషకరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంతన్న సారథ్యంలో, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలోకి రాగానే మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు బస్సు ఉచిత సౌకర్యం కల్పించారు. 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉచిత ఆరోగ్య స్కీం రెండు గ్యారెంటీల పైన సంతకం చేశారని సునీత రావు అన్నారు.

రాష్ట్రంలో మహిళలకు నామినేటెడ్ పదవులు ఇయ్యాలని మగవారికి దీటుగా మహిళలు పనిచేస్తున్నారని కార్పొరేషన్ చైర్మన్స్ కమిటీలలో తగిన స్థానం కల్పించాలని సునీత రావు అన్నారు. వివిధ పార్టీల నుండి ఎంఐ యం నుండి బిజెపి నుండి. అమాద్నే పార్టీ .నుండి బిఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు కండువాప్పిలోకి ఆహ్వానించారు.

సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజలందరికీ అందేటట్లు మహిళా కాంగ్రెస్ సహకరిస్తామని సునీత రావు అన్నారు. ఈ కార్యక్రమంలో నీలం పద్మ, సదాలక్ష్మి, దుర్గారాణి, రజిత, ఉషశ్రీ, లక్ష్మి, కవిత, మాధవి, సత్య, ప్రసన్న, విజయలక్ష్మి, వనిత, సరళ, రాజేశ్వరి, జయమ్మ, వసంత, తైసిన్, సుల్తానా, పుష్ప రెడ్డి, విద్య, సుభాషిని, అమృత, సంగీత, లతా, రమాదేవి, అనిత, ఉమా, మండల ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, టౌన్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News