తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి మాల మహానాడు (Mala Mahanadu) నాయకులు యత్నించారు. ఎస్సీ వర్గీకరణకు(SC Classification) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మద్దతు ఇవ్వడంపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. సీఎం డౌన్.. డౌన్ అంటూ నినాదాలతో అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తే.. సహించేది లేదని హెచ్చరించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కాగా అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా మాల సంఘాల నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టులు చేశారు. కాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణకు సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించారు.