చింతలకుంట గ్రామంలో తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకున్నారు. ఈ దినోత్సవాన్నిపురస్కరించుకొని భారీ ర్యాలీతో
బాలికల హక్కులు, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, లింగ సమానత్వం, బాల్య వివాహాలు, బాలికల సాధికారత, బాలికల ఉన్నత చదువులు టాస్ కమిటీలోని మొదటి లీడర్ మంజులా మాట్లాడుతూ బాలికలు ఎదుర్కొంటున్నఅసమానతలపై ‘విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస, బలవంతపు వివాహాలు’ వివక్షతపై అవగాహన పెంచడం వంటివాటిపై అవగాహన కల్పించారు.
లింగ సమానత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బాలికల సాధికారత ముఖ్యమైనది, బాలికలకు నాణ్యమైన విద్య, గౌరవప్రదమైన జీవితం లభించేలా మా చదువులు కొనసాగిస్తామని చెప్పారు.
డి. సి. పి.ఒ నరసింహ, మాజీ జెడ్ జెడ్పిటిసి రాజశేఖర్ , ఏ ఈ ఓ నరసింహులు , పంచాయతీ కార్యదర్శి తిమ్మన్ గౌడ్ , పాఠశాల ఉపాధ్యాయుడు, సి ఆర్ పి ఎఫ్ కన్వీనర్ బడే సాబు, రఘు కుమార్ శెట్టి, గ్రామ పెద్దలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు మరియు బాలికలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.