బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన హావభావాలు, మాట్లాడే తీరు అందరినీ నవ్విస్తాయి. ఒక్కోసారి వివాదాస్పదమవుతూ ఉంటాయి. తాజాగా ఓ మూవీ ఈవెంట్‌లో హీరోయిన్‌ను ఉద్దేశించిన ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆ సినిమా హీరోయిన్ కసి కపూర్‌పై హాట్ కామెంట్స్ చేశారు. హీరోయిన్ పేరు కసి కపూర్ అంట… ఆమె మంచి కసి కసిగా ఉంది అంటూ రెచ్చిపోయారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.
ఇక ఈ సినిమాలో నటించిన హీరో కూడా తమ కాలేజీ స్టూడెంట్ అంటూ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మల్లారెడ్డి వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. కూతురు వయసు ఉన్న హీరోయిన్ గురించి ఇలా వల్గర్‌గా మాట్లాడతారా అంటూ విమర్శిస్తున్నారు.