Tuesday, November 26, 2024
HomeతెలంగాణMallapur: నీళ్లు లేక వారమైంది, ఆమె రంగంలోకి దిగగానే సమస్య సాల్వ్!

Mallapur: నీళ్లు లేక వారమైంది, ఆమె రంగంలోకి దిగగానే సమస్య సాల్వ్!

గోడు విని, గోస తీర్చి..

త్రాగడానికి నీళ్లు లేక వారం రోజులుగా నానా తంటాలు పడుతున్న పాత ధాంరాజ్ పల్లి ఇందిరమ్మ కాలనీ ప్రజలు ఆగ్రహంతో గ్రామ పంచాయతీని ముట్టడించారు. వారం రోజులుగా త్రాగడానికి, కనీస అవసరాలకు నీళ్లు లేవని, గ్రామ పంచాయతీ కార్యదర్శికి విన్నవించినా పట్టించుకోవటం లేదని, ఇందిరమ్మ కాలనీ వాసులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

స్నానాలు చేయడానికి గోదావరికి వెళ్లే పరిస్థితి ఏర్పడ్డదని, మమ్మల్ని పట్టించుకునే వారు కరువయ్యారని భగీరథ నీళ్లు రావడం లేదని, ఉన్న బోరు మోటార్ పని చేయడం లేదని, తమ సమస్య పరిష్కరించాలని కోరుతూ ఇందిరమ్మ కాలనీ వాసులు గ్రామ పంచాయతీ వద్ద నిరసన వ్యక్తం చేసారు. నిరసనపై గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి డిప్యుటీ తహసీల్దార్ శ్రావణికి కార్యదర్శి తెలుపగా వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ప్రత్యేక అధికారి కాలనీ వాసులతో మాట్లాడారు.

సమస్య పరిష్కరించే వరకూ ఇక్కడే ఉంటానని వారితో చెప్పి, వెనువెంటనే తాత్కాలిక పరిష్కారం వెతికి, కాలనికి నీరు వచ్చేలా చేసారు. ఎండల తీవ్రత తర్వాత శాశ్వత పరిష్కారంతో నీటి కొరత లేకుండా చేస్తామని కాలనీ వాసులకు గ్రామ ప్రత్యేక అధికారి శ్రావణి హామీ తెలిపారు. గత వారం రోజులుగా తమ ఆవేదన, తమ సమస్యను పట్టించుకోని కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ప్రత్యేకాధికారిని కోరుతూ తమ సమస్యకి తాత్కాలిక పరిష్కారం వెతికి కాలనిలోకి త్రాగు నీరు రావడానికి కృషి చేసిన గ్రామ ప్రత్యేక అధికారి, డిప్యుటీ తహసీల్దార్ కు ఇందిరమ్మ కాలనీ వాసులు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News