ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని, గ్రామస్తులకు ఉపయోగపడే భూమిని మాజీ ప్రజా ప్రతినిధి కబ్జా చేసాడని, అట్టి భూమిని కాపాడాలని కోరుతూ కొత్త ధాంరాజ్ పల్లి గ్రామస్తులు మండల తహసీల్దార్ ఎల్. వీర్ సింగ్ కు వినతిపత్రం సమర్పించారు. వివరాల్లోకి వెళితే మండలంలోని కొత్త దామరాజ్ పల్లి గ్రామంలో గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతానికి గురవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేద ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వ భూమిని మాజీ ప్రజా ప్రతినిధి కబ్జా చేసిన ఘటన వెలుగు చూసింది. కొత్త ధాంరాజ్ పల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, దానిపై పెత్తనం చలాయిస్తున్నాడు.
గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిలో నివాసం ఉండేందుకు మందుల వారికి అనగా పాములు పట్టే వారికి కొంత స్థలాన్ని కేటాయించి వారి నివాసం ఉండేందుకు గ్రామస్తులు నిశ్చయించారు మిగతా స్థలాన్ని అలాగే ఉండగా పట్టి స్థలంలో గ్రామానికి కేటాయించిన పల్లె దావకాన కట్టాలని గ్రామస్తులు నిశ్చయించారు. దానికి అంగీకరించిన గ్రామ ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజల సహకారంతో ఆ స్థలానికి హద్దులు నిర్ణయించేందుకు వెళ్లగా మాజీ ప్రజాప్రతినిధి గ్రామ పెద్ద మనుషులపై దాడికి దిగారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి కాకుండా గ్రామ పెద్ద మనుషులపై దాడికి దిగడంతో గ్రామ పెద్దమనుషులు ఏకగ్రీవ తీర్మానంతో గ్రామానికి చెందిన భూమిని గ్రామస్తులకు అప్పగించాలని స్థానిక తహసిల్దార్ ఎల్ వీర్ సింగ్ కు వినతిపత్రం సమర్పించారు. తొందరలోనే సమస్యకు పరిస్కారం చూపుతామని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్త ధాంరాజ్ పల్లి గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Mallapur: కబ్జా కోరల్లో ప్రభుత్వ భూమి
కొత్త ధాంరాజ్ పల్లిలో కబ్జా చేసిన మాజీ ప్రజాప్రతినిధి