Sunday, July 7, 2024
HomeతెలంగాణMallapur: అంబేద్కర్ జయంతి వేడుకలు

Mallapur: అంబేద్కర్ జయంతి వేడుకలు

భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలు జరిపారు. ఈ సందర్బంగా ప్రముఖులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని, కుల మతాలకు అతీతంగా అంబేద్కర్ జయంతి వేడుకలను కొనసాగించాలని తెలిపారు.

- Advertisement -

అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కొత్త దామరాజు పల్లి సర్పంచ్ బద్దం సరిత కమలాకర్ రెడ్డి, ఉపసర్పంచ్ బట్టలత గంగాధర్, పంచాయతీ కార్యదర్శి సాయి కృష్ణ, గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News