భారత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆయుష్మాన్ భారత్ ఐదవ వార్షికోత్సవాన్ని కొత్త ధాంరాజ్ పల్లి గ్రామంలో ఘనంగా జరిపారు. అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్ హెచ్ ఓ సునంద బాలింతలకు పలు సూచనలు చేశారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. పిల్లలకు యోగా ప్రాముఖ్యత ను తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ర వహించాలని తెలిపారు.
- Advertisement -
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బద్దం సరిత, గ్రామ పంచాయతీ కార్యదర్శి సాయి కృష్ణ, ఎం ఎల్ హెచ్ ఓ సునంద, అంగన్వాడీ టీచర్ గంగామణి, ఆశ వర్కర్ నవ్య తదితరులు పాల్గొన్నారు.