Friday, November 8, 2024
HomeతెలంగాణMallapur: బలరాముడి విగ్రహావిష్కరణ

Mallapur: బలరాముడి విగ్రహావిష్కరణ

పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే

మల్లాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద బలరామ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా సాగింది. భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు ఏవి. రంగారావు, భారతీయ కిసాన్ ప్రముఖులు రైతులతో కలిసి బలరాముడి విగ్రహాన్ని ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా పనిచేయాలని, రైతులు ఎన్నో కష్టాలు ఎదుర్కుంటున్నారని, నష్టాలు అనుభవిస్తున్నారని, ప్రకృతి విలయతాండవం వల్ల రైతులు నష్టపోతున్నారని రైతులని ఆదుకునే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, మండల కేంద్రంలో బలరాముడు విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం చాలా సంతోషకరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘటన దోనూరి రాము, అఖిలభారత విద్యుత్ కార్యదర్శి ముదిగొండ శ్రీధర్ రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షులు పర్యాద అంజి రెడ్డి, అఖిల భారత జల విభాగం విజయ భాస్కర్ రావు, మండల వ్యవసాయ అధికారిని లావణ్య, జాగృతి ప్రముఖ అప్పల ప్రసాద్ జి జగిత్యాల జిల్లా అధ్యక్షులు రావుల. లింగారెడ్డి, ఉపాధ్యక్షులు కాసారం భూమ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఇప్ప రాజేందర్ మల్లాపూర్ మండల అధ్యక్షులు కళ్లెం మైపాల్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలాల జలపతి రెడ్డి మాజీ జెడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి బిజెపి మండల అధ్యక్షులు గోపిడి శ్రీనివాస్ రెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు, మండల రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News