Friday, November 8, 2024
HomeతెలంగాణMallapur: బార్బర్ నుండి ప్రభుత్వ ఉద్యోగిగా..

Mallapur: బార్బర్ నుండి ప్రభుత్వ ఉద్యోగిగా..

డీఎస్సీలో జాబ్..

బార్బర్ పనిచేస్తూ దొరికిన కొద్ది సమయం చదువుకు కేటాయిస్తూ, రాత్రిళ్ళు పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం పొందిన కొత్త ధాం రాజ్ పల్లి యువకుడు.

- Advertisement -

డీఎస్సీ ఫలితాలలో కొత్త దామరాజ్ పల్లి గ్రామానికి చెందిన పెండం హరీష్ ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎస్జీటీగా ఎంపికయ్యాడు. ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి దాకా ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, మెట్పల్లిలో ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ డిగ్రీ పూర్తిచేసి కాకతీయ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. ఒకవైపు బార్బర్ పనిచేస్తూ ఖాళీగా ఉన్న సమయంలో చదువుకొని డీఎస్సీ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎస్.జి.టిగా ఎంపిక అయ్యాడు.

ఆనందంలో తల్లిదండ్రులు ..

తమ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం పొందడం పట్ల తల్లి తండ్రులు సంతోషంలో మునిగిపోయారు. తమ గ్రామానికి చెందిన యువకుడు ప్రభుత్వ ఉద్యోగం పొందడం పట్ల గ్రామస్తులు, మిత్రులు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News