Sunday, November 16, 2025
HomeతెలంగాణMallapur: బూత్ లెవల్ ఆఫీసర్ విధుల నుండి మినహాయింపు ఇవ్వాలి

Mallapur: బూత్ లెవల్ ఆఫీసర్ విధుల నుండి మినహాయింపు ఇవ్వాలి

పంచాయతీ కార్యదర్శుల వినతి

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల ప్రక్రియ సంబంధించి గ్రామాలలో ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించింది. బూత్ లెవెల్ ఆఫీసర్లుగా పంచాయతీ కార్యదర్శులు కూడా విధులు నిర్వర్తించాలని తెలిపింది. బూత్ లెవెల్ ఆఫీసర్ విధులు లలో తమకు మినహాయింపు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వ విప్పు ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ని కోరారు.

- Advertisement -

పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. తమ ఆవేదనను ప్రభుత్వ యంత్రాంగానికి విన్నవించి తమకు బి ఎల్ ఒ ల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అందె. నరేష్, కోశాధికారి సతీష్, జిల్లా కార్యదర్శుల సంఘం కమిటి సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad