నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి మధ్య హోరాహోరీ జరుగుతుందని, ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉందని బిజెపి కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకున్న చివరికి విజయం బిజెపి అభ్యర్థి అరవిందుని వరించింది.
లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో అరవిందు విజయ ఢంకా మోగించారు. కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నిజాంబాద్ ఎంపీ అభ్యర్థిగా గెలవడం పట్ల బిజెపి శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మొదటి నుంచి అరవిందు-జీవన్ రెడ్డి మధ్య పోటీ ఉందని విశ్లేషకులు తెలిపారు. చివరకు అరవింద్ చేతిలో జీవన్ రెడ్డి ఓటమి చవిచూశారు.
అరవింద్ రెండోసారి గెలవడం, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడినడంతో అరవింద్ కు మంత్రి పదవి ఖాయమని బిజెపి కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. హోరాహోరీ అనుకున్న నిజాంబాద్ పార్లమెంటులో సునాయాసంగా అరవింద్ గెలవడం పట్ల మోడీ మార్కు అరవింద్ మార్కు కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు.