గత కొన్నేళ్లుగా దోబీఘాట్ కు సరైన దారి లేక రజకులు నానా తంటాలు పడుతున్నారని, పొలం గట్లపై నుండి నడవలేక ఇబ్బంది పడుతున్నారని, అలాగే బోయినికుంట నుండి పశువుల మంద వరకు ఉన్న దారి వెంట ఉన్న కొందరు దారిని ఆక్రమించుకున్నారని, దీంతో పశువులు మేతకు వెళ్లేందుకు దారి లేకుండా పోతోందని, నక్ష ప్రకారం ఉన్న దారులను చూపాలని కోరుతూ తహసీల్దార్ కు కొత్త ధాంరాజ్ పల్లి గ్రామ సేవా సమితి సభ్యులు వినతిపత్రం సమర్పించారు. ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కార మార్గం చూపాలని గ్రామ సేవా సమితి సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సేవా సమితి సభ్యులు ఏలేటి లింగా రెడ్డి, బద్దం శ్రీనివాస్ రెడ్డి, కమలాకర్, రాజేందర్, నర్సయ్య, జమాల్, రమేష్, సత్తయ్య, సంతోష్ లు పాల్గొన్నారు.