Saturday, November 23, 2024
HomeతెలంగాణMallapur: రైతుల్ని నట్టేట ముంచిన సోయా పంట

Mallapur: రైతుల్ని నట్టేట ముంచిన సోయా పంట

ఇక్కడ వందల ఎకరాల్లో సాగవుతున్న సోయాబీన్ రైతులందరికీ ఇదే దుస్థుతి

రైతులు ఆరుగాలం కష్టపడి వేసిన పంట నట్టేట ముంచడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. సోయాబీన్ పంట సాగు చేసిన రైతులకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాదు అనే ఉద్దేశంతో పంటను అలానే రోటవేటర్ వేస్తున్నారు. రైతులు సాగు చేసిన సోయాబీన్ పంట నిండా ముంచింది. మల్లాపూర్ మండల వ్యాప్తంగా వందల ఎకరాల్లో సోయాబీన్ పంట సాగు చేశారు. అకాల వర్షాలు, నకిలీ విత్తనాల వల్ల పంట రాకపోవడంతో పంటని అలానే దున్నుతున్నారు. ఒక్కొక్క రైతు ఐదు ఎకరాల్లో సాగుచేయడంతో తీవ్రంగా నష్టపోయారు. కష్టపడి పండించిన పంట నష్టం చేయడంతో రైతులు తీవ్ర దుఃఖంలో మునిగిపోతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వీరంతా కోరుతున్నారు. ప్రభుత్వం రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వన్ని వేడుకుంటున్నారు.

- Advertisement -

సొయాబీన్ పంట వేయడంతో తీవ్రంగా నష్టపోయాను, 3.½ ఎకరాల్లో వేసిన సోయా పంటలో గింజలు లేకపోవడం, దిగుబడి రాలేదని అలానే దున్నివేశాను. పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోయాను. పంట నష్టంతో పెట్టుబడి పెట్టిన దాదాపు ముప్పై ఐదు వేలు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి..

కాటిపల్లి. సుధాకర్ రెడ్డి, రైతు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News