Sunday, July 7, 2024
HomeతెలంగాణMallapur: రైతుకు దక్కని నష్టపరిహారం

Mallapur: రైతుకు దక్కని నష్టపరిహారం

నష్టపరిహారం కోసం రైతుల ఎదురుచూపులు

ప్రకృతి కన్నెర్ర చేస్తే మొదటగా నష్టపోయేది రైతు. ప్రకృతి కోపానికి రైతన్న లు తీవ్రంగా నష్టపోయారు.. గత ఇరవై రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు, వచ్చిన వరదకి రైతులకు అపార నష్టం వాటిల్లింది. మల్లాపూర్ మండల వ్యాప్తంగా వందల ఎకరాలల్లో పంటకు నష్టం వాటిల్లింది. మండల వ్యాప్తంగా నష్టపోయిన పంట అంచనా వేసి ప్రభుత్వానికి పంపారు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రులు, ఎమ్మెల్యే లు ప్రకటనలు చేశారు.

- Advertisement -

ఇప్పటికి ఒక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం అందలేదు. పెట్టిన పెట్టుబడి వరద పాలు అవ్వడం, వరద ప్రవాహానికి పొలాలు నామారుపల్లేకుండా కావటం, మళ్ళీ పంట వేసే స్థితి లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వరదలప్పుడు వచ్చి పరామర్శించిన నాయకులు పంట నష్టపరిహారం కొసం ఒక్కరు మాట్లాడటం లేదని, ప్రభుత్వం ని అడిగేవారు కరువయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతంగానికి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి, రైతులని ఆదుకోవాలి. గత 4ఏళ్లుగా అంచనా వేస్తున్నారే తప్ప పరిహారం ఇవ్వడం లేదు. రైతుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోని తొందరగా నష్ట పరిహారం అందేలా చూడాలి. -నత్తి. రాము
రాఘవపేట రైతు

గత మూడేళ్లుగా వరద ప్రవాహానికి నష్టం వాటిల్లుతున్నది.వేసిన పొలం కొట్టుకపోవడం తో చాలా నష్టపోయాను. నాలుగు ఎకరాల పొలంలో రెండు ఎకరాల పొలం వరద కు నామ రూపాల్లెకుండా కొట్టుకపోయింది. మూడేళ్లుగా ఇదే తంతు ఎవ్వరు పట్టించుకునే వారు లేరు. ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం ఇచ్చి రైతులని ఆదుకోవాలి. – ఎదులాపురం. రమేష్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News