Sunday, December 8, 2024
HomeతెలంగాణMallapur: రైతుల శ్రేయస్సే జీవన్ రెడ్డి ధ్యేయం

Mallapur: రైతుల శ్రేయస్సే జీవన్ రెడ్డి ధ్యేయం

అన్ని వర్గాలకు మేలు

ప్రజా ప్రభుత్వంలో రైతులకు మేలు జరుగుతుందని, రాబోయే రోజుల్లో మూత పడ్డ చక్కెర కర్మాగారం పునః ప్రారంభం కానుందని, ఫ్యాక్టరీ పునరుద్దరణ కోసం పాటు పడిన వ్యక్తి జీవన్ రెడ్డిని రైతులు గెలిపించాలని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి కోరారు. ముత్యంపేటలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సత్యం రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదు నెరవేర్చి ప్రజలకు మేలు చేస్తున్నామని, రైతులు ఏళ్లుగా ఎదురు చూస్తున్న చక్కెర ప్యాక్టరి పునః ప్రారంభం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, జీవన్ రెడ్డి కృషి మరువ లేనిదని, రాబోయే రోజుల్లో చెరుకు రైతుల కల నెరవేర బోతుందని, రైతులు అంతా జీవన్ రెడ్డికి మద్దతుగా నిలవాలని, అధిక మెజారిటీతో ఎంపీగా గెలిపించి, పార్లమెంట్ కు పంపించాలని కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొమ్ముల చిన్నా రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు దామెర. రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గంధం రాజేశం, రాజేష్, వంగ అశోక్ యాదవ్, ఎండి. జాఫర్, దామెరా రాజేష్, చింతల ముత్తయ్య, ఏలేటి నరందేర్ రెడ్డి, గంగాధర్, పోశయ్య, బొల్లం ఎల్కయ్య, అశోక్, మనోజ్, బండి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News