Friday, November 8, 2024
HomeతెలంగాణMallapur: నూతన టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక పట్ల హర్షం

Mallapur: నూతన టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక పట్ల హర్షం

అభినందనల వాన..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నూతన అధ్యక్షున్ని ఏఐసీసీ ప్రకటించింది. టిపిసిసి ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో నూతన అధ్యక్షునిగా శాసన మండలి సభ్యులు బొమ్మ. మహేష్ కుమార్ గౌడ్ ని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసి .వేణుగోపాల్ ప్రకటించారు. నూతన అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక పట్ల మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సామాన్యుడికి పట్టం కట్టడం పట్ల రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీక, మల్లికార్జున ఖర్గే లకు చిన్నా రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మహేష్ కుమార్ గౌడ్ చేసిన కృషికి దక్కిన గౌరవం అని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News