Friday, September 20, 2024
HomeతెలంగాణMallapur: సియస్ఆర్ కు అండగా నిలుద్దాం

Mallapur: సియస్ఆర్ కు అండగా నిలుద్దాం

సేవకుడు ఎమ్మెల్యే కావాలి

రైతుల, గల్ఫ్, బీడీ కార్మికుల కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడు చెన్నమనేని శ్రీనివాస రావు (సియస్ఆర్) వెంటే తాము నడుస్తామని, రైతులం, గల్ఫ్ కార్మికులం అండగా ఉంటామని, సియస్ఆర్ గెలుపు కోసం కష్టపడుతమని ఏలేటి లింగా రెడ్డి, నేవూరి శ్రీధర్ తెలిపారు. నియోజకవర్గ రైతులు, గల్ఫ్, బీడీ కార్మికులు,ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు సియస్ఆర్ అని నియోజకవర్గ ప్రజలు అయన వెంటే ఉన్నారని, రోజు రోజుకు మద్దతు పెరుగుతుందని, బీ ఆర్ యస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు త్వరలోనే పెద్ద ఎత్తున సి యస్ ఆర్ కు మద్దతుగా నిలువబోతున్నారని నేతలు తెలిపారు. చక్కెర కర్మాగారం పునఃప్రారంభం కోసం తపిస్తున్న నాయకుడు సి యస్ ఆర్ అని, ఎలాంటి పదవులు లేకున్నా రాజకీయం చేయకున్నా నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నాడని, గల్ఫ్ కార్మికుల గోసలు తెలిసిన నాయకుడని, సబ్బండ వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా మద్దతుగా ఉండాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News