Friday, September 20, 2024
HomeతెలంగాణChennamaneni @ Mallapur: గడిచిన జీవితం నా కోసం, గడిపే జీవితం మీ కోసం

Chennamaneni @ Mallapur: గడిచిన జీవితం నా కోసం, గడిపే జీవితం మీ కోసం

బీడీ కార్మిక కుటుంబం నుంచి వచ్చా గెలిపించండి

ముత్యంపేటలోని పెద్దమ్మ ఆలయం వద్ద చెన్నమనేని శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేశారు. ప్రచార వాహననికి ప్రత్యేక పూజలు చేసి, ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా చెన్నమనేని శ్రీనివాస రావు ప్రసంగిస్తు రైతులు బీడీ కార్మికులు గల్ఫ్ కార్మికుల మద్దతుతో ఆల్ ఇండియా బ్లాక్ ఫార్వర్డ్ అభ్యర్థిగా సింహం గుర్తుతో ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి పోటీ చేస్తున్నానని, రాజకీయ కుటుంబం నుండి రాలేనని, బీడీ కార్మిక కుటుంబం నుండి, ఎన్నో కష్టనష్టాలు అనుభవించిన కుటుంబం నుండి రాజకీయాల్లోకి వస్తున్నానని, ఇప్పుడున్న బీఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులలాగా వారసత్వం నుండి రాజకీయాలలోకి రాలేనని
రైతు కష్టాలు చూసినా, బీడీ కార్మికుల ఆవేదన తెలిసిన వాడిని, గల్ఫ్ కార్మికుల గోసలు తెలిసిన వాడిని, రైతుల, గల్ఫ్ కార్మికులు, మహిళల శ్రేయస్సు కోసం మీ ముందుకు వస్తున్ననని సోదర సోదరీమణులు అండగా నిలవాలని కోరారు. చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ తన ముఖ్య లక్ష్యమని దాని కోసం చివరిదాకా పోరాడుతానని తెలిపారు.

- Advertisement -

చక్కెర ఫ్యాక్టరీ ముసివేతతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, మొన్న జరిగిన బిఆర్ఎస్ సభలో ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారేమో అని నియోజకవర్గ రైతులంతా చూసారని, కానీ ముఖ్యమంత్రి ఫ్యాక్టరీ ఊసే ఎత్తలేదని, రైతులను కించపరిచారని అన్నారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే మాయ మాటలు చెప్పి గెలిచాడని, వంద రోజుల్లో ఫ్యాక్టరీ తెర్వకపోతే ఫ్యాక్టరీ గేటుకు ఉరిసుకుంటా అని చెప్పిన ఎమ్మెల్యే మాట తప్పారని, ఎమ్మెల్యేగా గెలిచి 14 ఏళ్ళు అయినా నియోజకవర్గం అభివృద్ధి శూన్యం అని, డిసెంబర్ 3 నా నియోజకవర్గ ప్రజలు ఆజ్ఞత వాసం విడబోతున్నారని అన్నారు. ఎమ్మెల్యే ఒక్కరికి కూడా న్యాయం చేయలేదని, నమ్ముకున్న వారిని నిండా ముంచిండని తెలిపారు.
ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీ పట్నం తీసుకుపోయి పీజీ కాలేజీ కావాలనడం టిఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ మూర్ఖంత్వం అని, డాక్టర్ అయినా సంజయ్ రైతుల, గల్ఫ్ కార్మికుల గుండెలు పరీక్షించి చుస్తే వాళ్ళ బాధ తెలుస్తుంది, గల్ఫ్ కార్మికులు మృతి చెందిన వారికి ఐదు లక్షలు ఇస్తామని మాట తప్పారన్నారు.

గల్ఫ్ ప్రవాసి బోర్డు ఏది?
గల్ఫ్ లో మృతి చెందిన కార్మికుల మృతదేహం రావాలంటే 3 నెలలు కావస్తుంది.. ప్రభుత్వం ఏం చేస్తుంది, తుపాకులతో కొట్టుకునే కోరుట్ల వద్దు..రైతుల కోరుట్ల కావాలి అన్నారు. నియోజకవర్గంలో హిందూ ముస్లింలు ఐక్యతతో ఉన్నామని, అరవింద్ వచ్చాక మతాల మధ్య చిచ్చు పెట్టి, ఐక్యతను విచ్చిన్నం చేయాలనీ చూస్తున్నారని, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. అలాంటి వారిని నమ్మకండని తెలిపారు.
ఒక్కసారి అవకాశం ఇవ్వండి
నియోజకవర్గ నిరుద్యోగులకు ఉద్యోగలు లేవు…ఎంపిగా ఉండి నువ్వు చేసిన ఒక్క పని ఉందా అని నిలదీశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికలు వచ్చినప్పుడే కనిపిస్తాడని, ప్రజల బాధ తనకి అక్కర లేదని అలాంటి వారికి ఎన్నికల్లో బుద్ది చెప్పాలని తెలిపారు. వరి రైతులను అధిక తూకంతో నట్టేట ముంచుతుర్రు. 12 కిలోల దాక జోకి రైతులను నష్టపెడుతుర్రు.. రైతుల వద్ద తీసుకున్న తప్ప, తాలు సొమ్మును రైతు బంధు రూపంలో ఇస్తుర్రని, రైతులు ఇక మోసపోవద్దని ఓటు రూపంలో సమాధానం చెప్పాలని అన్నారు.

అందరూ వారసత్వం నుండి వచ్చిన వారే..
బీడీ కార్మిక కుటుంబం నుండి వచ్చిన వాడిని నేనొక్కడినే కనుక ఒక్కసారి అవకాశం ఇవ్వండి అందరికి అండగా ఉండి, నియోజకవర్గ అభివృద్ధికి, చక్కెర కర్మాగారం పునః ప్రారంభానికి, గల్ఫ్, బీడీ కార్మికుల గోసలు తీర్చడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమం లో రాజేష్, గడ్డం నవీన్, నేవూరి శ్రీధర్, ఏలేటి లింగా రెడ్డి, రాం చందర్ రావు, రైతులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News