Sunday, December 8, 2024
HomeతెలంగాణMallapur: పేరు ఒక్కటి..ఓట్లు మూడు

Mallapur: పేరు ఒక్కటి..ఓట్లు మూడు

వేర్వేరు ఐడీ కార్డులపై 3 ఓట్లా?

ఎలక్షన్ అధికారులు ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియ సజావుగా చేయలేదు. ఎలక్షన్ కమిషన్ నూతనంగా ప్రకటించిన జాబితాలో ఒక్క వ్యక్తిపై మూడు ఓట్లు ఉన్న ఘటన చిట్టాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. చిట్టాపూర్ గ్రామానికి చెందిన రష్మిత అనే మహిళపై మూడు ఓట్లు నమోదు అవ్వడం, మూడు ఐడి కార్డులు వేర్వేరు ఉండటం పట్ల గ్రామ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తికి 3 ఓట్లు ఎలా ఉంటాయని, అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మండిపడుతున్నారు. అలసత్వంగా ప్రవర్తించి, ఒక్కరి పేరుపై మూడు ఓటు హక్కు కల్పించిన అధికారులపై ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలిమరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News