Saturday, November 23, 2024
HomeతెలంగాణMallapur: రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం

Mallapur: రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మల్లాపూర్ లో రైతు దినోత్సవం

మల్లాపూర్ మండలంలోని కొత్తదామరాజు పల్లి మొగిలిపేట మల్లాపూర్ ముత్యంపేట చిట్టాపూర్ క్లస్టర్ల పరిధిలో రైతు వేదిక భవనలలో రైతు దినోత్సవ సంబరాలు సాగాయి. కొత్త ధాంరాజ్ పల్లి రైతు భవన్ లో జరిపిన రైతు దినోత్సవ సంబరాల లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు వ్యవసాయం ఎలా ఉండే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎలాగా మారింది రైతులకు వివరించారు. మండలంలో రైతు బందు, ,రైతు బీమా లబ్ధిదారుల వివరాలు తెలిపి పథకాల వల్ల మండలంలో లబ్ధి పొందిన రైతులున్నారని, ప్రభుత్వం రైతు పక్షపాతి అని నాయకులు అన్నారు.

- Advertisement -

రైతు దినోత్సవ సారాంశాన్ని అధికారులు రైతులకు చదివి వివరించారు.. రైతులను ఉద్దేశించి స్పెషల్ ఆఫీసర్లు నారాయణరెడ్డి రవీందర్ మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి జరపాలని, ప్రభుత్వ సూచనల మేరకు వరి పంటను కూడా వర్షాకాలంలో ముందు వేయాలని రైతులకు సూచించారు రైతులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే రైతు సంబంధిత అధికారులను కలిసి తమ సమస్యలను తెలపాలని అన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతన్నకి ఎల్లవేళలా అండగా ఉంటుందని రైతుబంధు రైతు బీమా తోపాటు పంట నష్టపరిహారం ఇస్తూ రైతులని ఆదుకుంటుందని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా స్థాయి స్పెషల్ ఆఫీసర్ ఎస్ ఆర్ ఓ నారాయణరెడ్డి తహసిల్దార్ రవీందర్, ఎంపీపీ కాటిపల్లి సరోజన, సర్పంచులు బద్దం సరిత, మైదాసు శ్రీనివాస్ పాలెపు దిలీప్ ఏఈవో వంశీ, నాయకులు కమలాకర్ రెడ్డి ఆది రెడ్డి, గంగాధర్, సురేష్ రావు నరేష్ రెడ్డి రాజేందర్, సురేష్, పంచాయతీ కార్యదర్శి సాయి కృష్ణ, రైతు బందు సమితి కో ఆర్డినేటర్ లు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News