Saturday, October 12, 2024
HomeతెలంగాణMallapur: రుణమాఫీకి అర్హత ఉన్న రైతుల కుటుంబ నిర్ధారణ

Mallapur: రుణమాఫీకి అర్హత ఉన్న రైతుల కుటుంబ నిర్ధారణ

వృద్ధురాలి ఇంటికెళ్లి వివరాల సేకరణ ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేసిన రుణ మాఫీకి అర్హత ఉండి కుటుంబ నిర్ధారణ లేకపోవడం వల్ల రుణమాఫీ కానీ రైతుల వద్దకు వెళ్లి వారి వివరాలను మల్లాపూర్ మండల వ్యవసాయ అధికారిని లావణ్య సేకరించారు. మల్లాపూర్ మండలంలోని సిర్పూర్ గ్రామంలో రేషన్ కార్డులో పేరు లేకపోవడం కుటుంబ నిర్ధారణ లేక పోవడం వల్ల, వయోభారం చెందిన మిట్టపల్లి . రాజవ్వ ఇంటి వద్దకు వెళ్లి రుణమాఫీ వివరాలు కుటుంబ నిర్ధారణ పూర్తి చేసినట్లు మండల వ్యవసాయ అధికారిణి లావణ్య తెలిపారు.

- Advertisement -

అర్హత ఉన్న ప్రతి రైతు వివరాలు ఎప్పటికప్పుడు పంపిస్తున్నామని, రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సంధ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బద్దం శేఖర్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు దామెర రాజశేఖర్ రెడ్డి, మిట్టపల్లి. శేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News