ఇటీవల జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్సులో జగిత్యాల ఎస్సై అనిల్ యాదవ్ భార్య బస్సులో ప్రయాణిస్తుండగా ఇంకో మహిళతో జరిగిన గొడవలో పూర్తి విచారణ జరపకుండా ఎస్సైని సస్పెండ్ చేయడం హేయమైనా చర్యని మల్లాపూర్ మండల కేంద్రంలో అఖిల భారతీయ మహాసభ యాదవుల ఆధ్వర్యంలో మల్లాపూర్ లో భరతమాత కూడలి వద్ద యాదవులు ధర్నా నిర్వహించారు. గురువారం మల్లాపూర్ పట్టణ బంద్ కు పిలుపునిచ్చారు. మల్లాపూర్ మండల్ ప్రజలు, దుకాణదారులందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మల్లాపూర్ మండల్ సబ్ రెవిన్యూ అధికారి శ్రావణికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మల్లాపూర్ మండల అధ్యక్షుడు సంఘ గంగరాజం మాట్లాడుతూ వెంటనే విధుల్లో కి తీసుకోకుంటే అఖిల భారతీయ మహా సభ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అంత ఉద్యమం చేస్తాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షుడు సంఘ గంగరాజం యాదవ్, యాదవ సంఘ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రాజా గంగరాజం, వంగ అశోక్ యాదవ్ , బైరి రవి యాదవ్, బజారు శ్రీధర్ యాదవ్, అల్లే వినోద్ యాదవ్, దానవేని మధు యాదవ్, తోట్ల సత్యం యాదవ్, రాజా మల్లయ్య యాదవ్, అల్లే చంద్రయ్య యాదవ్, కంటే నరేష్ యాదవ్, సంఘ సందీప్ యాదవ్, దానవేని నరేష్ యాదవ్, హరికంటి గంగమల్లయ్య యాదవ్,జాల రెడ్డి యాదవ్, హారికంటి రాజేందర్ యాదవ్, వేల్పుల రాజాం యాదవ్, బింగి శేఖర్ యాదవ్, పెద్దినేని అనిల్ యాదవ్, అధారి రాజేందర్ యాదవ్, యాదవ్ సంఘ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.