Wednesday, January 22, 2025
HomeతెలంగాణMallapur: బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

Mallapur: బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

ఆపదలో ఉన్న కుటుంబాలకు రేగుంట ఆల్ యూత్ అసోసియేషన్&స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు అండగా నిలుస్తున్నారు. రేగుంట గ్రామానికి చెందిన చందనగిరి విజయ క్యాన్సర్ బారిన పడి చిన్న వయసులోనే మృతి చెందింది. ఆమె కు భర్త రాజేష్ ఇద్దరు ఆడ పిల్లలు బావన (16), నిఖిత (13) ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన కుటుంబం కావడంతో గ్రామాస్తుల సహకారంతో ఆల్ యూత్ అసోసియేషన్&స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు విరాలాలు సేకరించి 51 వేల రూపాయల నగదు కుటుంబ సభ్యులకు అందచేశారు. ఆర్థికంగా అండగా నిలిచిన స్పోర్ట్స్ క్లబ్ సభ్యులకి గ్రామస్తులకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో.. రేగుంట ఆల్ యూత్ అసోసియేషన్ & స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి వేములవాడ దేవరాజం, క్యాషియర్లు కత్తి నరేష్,మోతె రవి, కార్యదర్శి కుందేళ్ల రాజేష్, సంయుక్త కార్యదర్శి ఆశ్రఫ్, సభ్యులు ముస్తఫా, బొల్లారపు వినోద్, కుక్కుదూగు అశోక్,భైర రాకేష్, మాట్ల విజయ్ మోతె మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News