Saturday, November 23, 2024
HomeతెలంగాణMallapur: సోమన్న..ఘాట్ రోడ్డుకు మోక్షం ఎప్పుడు?

Mallapur: సోమన్న..ఘాట్ రోడ్డుకు మోక్షం ఎప్పుడు?

లక్షల్లో ఆదాయం.. అభివృద్ధి శూన్యం

మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన కనక సోమేశ్వర స్వామి దేవాలయ సన్నిధికి వెళ్లే ఘాట్ రోడ్డు నిర్మాణం కలగానే మిగిలిపోతుంది. ఘాట్ రోడ్డు నిర్మాణం గురించి నాయకులు ఆలోచించకపోవడం, ఘాట్ రోడ్డు పనులు ప్రారంభం కాకపోవడం, అధికారులు పరిశీలన పేరుతో తూతు మంత్రంగా వచ్చిపోవడం ఇదే తంతుగా జరుగుతుంది. అధికారుల పరిశీలన,అంచనా అంటూ నానా హడావిడి జరుగుతుంది. కానీ ఒక్క అడుగు ముందుకు రావడం లేదు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చొరవతో పది కోట్లు మంజూరు అయ్యి ఐదు నెలలు ఐతున్నప్పటికి పని ముందుకు సాగకపోవడం వలన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. వచ్చే శ్రావణమాసం పురస్కరించుకొని వేలల్లో భక్తుల తాకిడి ఉంటుంది.

- Advertisement -

ప్రతి సోమవారం, అలాగే శ్రావణమాసంలో, మహాశివరాత్రి రోజున భక్తులు అధిక సంఖ్యలో సోమేశ్వరుని దర్శనం చేసుకుంటారు. ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి సోమేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కాలినడక వలన చాలా మంది భక్తులు ఇబ్బందులు పడుతూ సోమేశ్వర కొండ ఎక్కుతున్నారు..ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయితే భక్తుల సంఖ్య అధికంగా పెరిగి, ఆలయ అభివృద్ధి మరింత పెరుగుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
లక్షల్లో ఆదాయం ఉన్న భక్తులు ప్రయాణించేందుకు సరైన మార్గం లేకపోవడం వల్ల భక్తులు నానా తంటాలు పడుతున్నారు..ఘాట్ రోడ్డు నిర్మాణం చేపడితే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని ఎన్నికల్లో హామీలు కాకుండా పనులు ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలా స్థానిక ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు ద్రుష్టిసారించి తొందరగా ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News