ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సమయానికి గేటు తీయక గేటు దూకి స్కూల్ లోకి వెళ్తున్నారు. ఓబులాపూర్ ప్రాథమిక పాఠశాలలో సమయానికి ఉపాధ్యాయులు రాక పాఠశాల వద్ద వేచి చేసి, సహనం నశించి గోడదూకి విద్యార్థులు పాఠశాల లోపలికి వెళ్ళినారు. సమయానికి గేటు తెరవకపోవడం వల్ల విద్యార్థులు నానా తంటాలు పడ్డారు. ఇలాంటి ఘటన ఇప్పటికీ రెండు మూడు సార్లు జరిగినట్టు విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపారు.
గత నెల రోజుల క్రితం పాఠశాలలో వేసిన తాళం వేసినట్టు ఉండి పెయింట్ డబ్బాలు చోరీ అయ్యాయని, ఇప్పటికి వాటి ఆచూకీ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు. కనీసం ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, సమయానికి పాఠశాలకు వచ్చి విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పలని విద్యార్థుల తల్లితండ్రులు కోరారు.ఇట్టి విషయం పై ఓబులాపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలుని అడగగా తాళం చేతులు పాఠశాల దగ్గరలోని కిరాణం లో పెట్టమని, గతంలో జరిగిన సంఘటనల వల్ల అక్కడే ఉంచామని సమయం కొద్దిగా ఆలస్యం అయ్యిందని, మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకుంటామని తెలిపారు.