పేరుకే మహిళలకు పదవులు కానీ పెత్తనం వెలగబెట్టేది మాత్రం వారి భర్తలే. ఇది గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ జరిగే షరామామూలు తంతే. తాజాగా మల్లాపూర్ మండల కేంద్రంలో ఇదే సీన్ రిపీట్ అయింది.
సహకార సంఘం నూతనంగా నిర్మించిన గోదాం, సహకార సంఘ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అధికారికంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిన పెద్దలు, సంబంధిత వ్యక్తులు కాకుండా వేరేవారు కనిపించటం మల్లాపూర్ లో హాట్ టాపిక్ గా మారింది. సభా వేదికపై మహిళా ఎంపీపీ బదులు ఆమె భర్త కూర్చోవడంతో ఈ కలకలం స్టార్ట్ అయింది. పక్కనే ఎమ్మెల్యే ఉన్నా కూడా అతన్ని వారించకపోవడం మరో విచిత్రం.
అయినా ఇదంతా మొదటిసారి కూడా కదా. గతంలోనూ పదపదే ఇదే జరిగింది, ప్రజలు కూడా చర్చించుకున్నారు. ఇప్పటికీ ఆ ఎంపీపీ, ఆమె భర్తలో ఈ విషయంపై మార్పు రాకపోవటంతో చేసేది లేక అందరూ చర్చలకే పరిమితమవుతున్నారు. ఒకసారి ఏకంగా మాజీ ఎమ్మెల్యే అతని తీరుపై బాహాటంగానే అగ్రహించారు, అయినా ఆయనగారు మారితేగా, మారరు.
ప్రభుత్వ అధికారిక కార్యక్రమల్లో కుడా సతులకు బదులు పతులు కూర్చోవడం.. అనధికార పెత్తనం చెలయించడం ఏంటని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.