యోగతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతంగా ఉండవచ్చని, ప్రతి ఒక్కరు యోగ చేయాలనీ జడ్పీటీసీ సంది రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాత ధాంరాజ్ పల్లి గ్రామంలో చెరువుకట్ట పైన గ్రామ సర్పంచ్, ఉపాధి హామీ కూలీలతో కలిసి అంతర్జాతీయ యోగ దినోత్సవం జరిపారు. చెరువుకట్ట పైన యోగా చేసారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు, పాత ధాంరాజ్ పల్లి గ్రామ సర్పంచ్ మైదాసు శ్రీనివాస్, పాక్స్ డైరెక్టర్ కొత్తూరు నారాయణ రెడ్డి, నాయకులు నరేష్ రెడ్డి, ఆది రెడ్డి, శ్రీనివాస్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.