తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ సాహిత్య దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా ,అడిషనల్ కలెక్టర్ ప్రతి మాసింగ్, నర్సాపూర్ ఆర్డీవో, ఎంపీపీ, జడ్పిటిసి, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీల చేతుల మీదుగా మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో ప్రముఖ కవి మల్లినాథసూరి విగ్రహానికి విగ్రహానికి పూలమాలలతో సాహిత్య నివాళులర్పించారు. ముందుగా స్థానిక ఎల్లమ్మ దేవాలయం నుండి ప్రజలు నాయకుల ఆధ్వర్యంలో డప్పు చప్పులతో బతుకమ్మ, బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రంథాలయ ఆవరణలోని మల్లనాథసూరి విగ్రహం వద్ద ఉంచారు. అనంతరం ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రజా నాయకులు, ప్రభుత్వ అధికారులు మల్లినాథ సూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ సందర్భంగా కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ షేరు సుభాష్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గొప్ప సంస్కృత పండితుడు మళ్లీనాత సూరి మెదక్ జిల్లా వాడు కావడం జిల్లా వాసులు అందరికీ గర్వించదగ్గ విషయం అన్నారు. సమైక్యాంధ్ర నాయకుల పాలనలో మళ్లీనాథ సూర్య వంటి గొప్పకాలు వెలుగులోకి రాలేకపోయారన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ కొల్చారం గ్రామంలో మళ్లీనాథసూరి విశ్వవిద్యాలయం ఏర్పడనుండడం గర్వించదగ్గ విషయమని, సీఎం కేసీఆర్ మొదట సంస్కృత విశ్వవిద్యాలయాన్ని యాదగిరిగుట్టలో ఏర్పాటు చేస్తానన్నారని, తాను సుమారు 10, 15 సార్లు సీఎం కి చెప్పి, నచ్చచెప్పి కొల్చారం లో ఏర్పడేటట్లు చేశానన్నారు. ఇటువంటి గొప్ప విశ్వవిద్యాలయం రావటం తనకు గర్వకారణం అని, గ్రామస్తులకు గౌరవ ప్రదమని, నర్సాపూర్ నియోజకవర్గ వాసులకు, మెదక్ జిల్లా వాసులకు సంతోషదాయకమన్నారు.
ప్రజలు భూసేకరణకు సహకరించాలని, భూసేకరణ విషయంలో ప్రభుత్వం ప్రజలపై అధికార దర్పం చూపెట్టదని వారి ప్రేమాభిమానాలతోనే భూసేకరణ జరుగుతుందని, భూములు కోల్పోయిన వారికి తరిగిన పరిహారం ఇప్పిస్తామని, అర్హులైన వారికి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు.
Mallinatha Suri University: యూనివర్సిటీకి సీఎం భూమి పూజ
ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గొప్ప సంస్కృత పండితుడు మళ్లీనాత సూరి మెదక్ జిల్లా వాడు కావడం జిల్లా వాసులు అందరికీ గర్వించదగ్గ విషయం