Saturday, November 15, 2025
HomeతెలంగాణMalreddy Rangareddy: యువత స్వయంకృషితో ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలి

Malreddy Rangareddy: యువత స్వయంకృషితో ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపుర్ మెట్ చౌరస్తాలో వాస్తవ్యుడు జొన్నల నర్సింగ్ యాదవ్ ఏర్పాటు చేసిన AN డిజిటల్ ఫ్లెక్సీ ప్రింటర్స్ ను టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఇలాంటి ఫ్లెక్సీ ప్రింటర్స్ ప్రజలకు, రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని, ఇలాంటి స్వయంకృషితో మరో నలుగురికి ఉపాధినివ్వడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిపి బుర్ర రేఖ మహేందర్ గౌడ్, జెడ్పిటిసి సభ్యులు బింగి దేవదాస్ గౌడ్ తో పాటు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ గౌడ్జ్ ఎంపిటిసి తాటిపెళ్లి సౌమ్య – రమేష్ గౌడ్, ఉపసర్పంచ్ చెరుకు కావ్య – శివశంకర్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు గౌస్ తో పాటు బుర్ర చంద్రంగౌడ్, పంది పెంటయ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad