Sunday, November 24, 2024
Homeతెలంగాణఆటోలో ఫోన్ మరిచిపోయిన యువకుడు.. రూ.57 వేలు స్వాహా

ఆటోలో ఫోన్ మరిచిపోయిన యువకుడు.. రూ.57 వేలు స్వాహా

ఆటోలో ఫోన్ మరిచిపోయి.. రూ.50 వేలు పోగొట్టుకున్నాడో యువకుడు. హైదరాబాద్ లోని పంజాగుట్ట వద్ద నవంబర్ 23న జరిగిన ఈ ఘటన మూడ్రోజులు ఆలస్యంగా వెలుగుచూసింది. బ్యాంక్ అకౌంట్ నుండి నగదు ట్రాన్స్ఫర్ అయినట్లు తెలియడంతో.. బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చెందిన వీరప్రతాప్ సింగ్ సింగరేణిలో ఉద్యోగి. ఇటీవల తన బంధువుని కలిసేందుకు హైదరాబాద్ కు వచ్చాడు.

- Advertisement -

ఈఎస్ఐ ఆస్పత్రిలో ఉన్న బంధువుని కలిసి బుధవారం తెల్లవారుజామున తిరిగి మంచిర్యాల్ వెళ్లేందుకు బయల్దేరాడు. ఉదయం 4.30 గంటల సమయంలో సికింద్రాబాద్ కు వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. పంజాగుట్ట దగ్గర వీరప్రతాప్ ను దింపేసి, ఆటో డ్రైవర్ బంజారాహిల్స్ వైపు వెళ్లాడు. ఆటో వెళ్లిపోయాక చూసుకోగా మొబైల్ ఫోన్ కనిపించలేదు. ఆటో కోసం వెతికినా ఉపయోగంలేక, చేసేదేంలేక వీరప్రతాప్ మంచిర్యాలకు వెళ్లిపోయాడు. అక్కడ ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు ప్రయత్నించగా.. నో బ్యాలెన్స్ అని చూపించడంతో బ్యాంకును ఆశ్రయించాడు.

తన ఖాతాలో నగదు కనిపించడం లేదని సిబ్బందికి చెప్పగా.. వివరాలు చూసిన చెక్ చేసిన సిబ్బంది.. వీరప్రతాప్ గూగుల్ పే, ఫోన్ పే ల నుంచి వివిధ ఖాతాలకు రూ.57,362 ట్రాన్స్ ఫర్ అయ్యాయని చెప్పారు. దాంతో షాకైన అతడు.. తన మొబైల్ మిస్సైన దొంగిలించిన వ్యక్తే తన ఖాతాలోంచి డబ్బులు కాజేశాడని, హైదారాబాద్ లోని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అది ఆటోడ్రైవర్ పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఆటో ఆచూకీ కోసం ఎర్రగడ్డ నుంచి పంజాగుట్ట వరకు ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News