Thursday, September 19, 2024
HomeతెలంగాణManakonduru: ఘనంగా బీ.ఆర్.ఎస్.పార్టీ ఆవిర్బావ వేడుకలు

Manakonduru: ఘనంగా బీ.ఆర్.ఎస్.పార్టీ ఆవిర్బావ వేడుకలు

రాష్ట సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ సారథ్యంలో మానకొండూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో బీ.ఆర్.ఎస్.పార్టీ ఆవిర్బావ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దీనిలో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే రసమయి జెండాను ఎగురవేసి, అనంతరం మహాత్మానగర్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేతి రెడ్డి దేవేందర్ రెడ్డి, ఉళ్లేంగల ఏకానందం, పాశం అశోక్ రెడ్డి, జక్కని రవీందర్, నాయీని వెంకట్ రెడ్డిలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బీ.ఆర్.ఎస్.పార్టీ అధ్యక్షులు ఎలుక ఆంజనేయులు మంగళవారం గ్రామంలో జెండాను ఎగురవేసి బీ.ఆర్.ఎస్.పార్టీ ఆవిర్బావ వేడుకలు అత్యంత వైభవంగా జరిపి అనంతరం స్వీట్ పంపిణీ చేశారు. నాడు తెలంగాణ సాధనకోసం రూపొందిన జెండా టిఆర్ఎస్ పార్టీ నేడు భారత ప్రజలను సుభిక్షంగా ఉండాలని రూపాంతరం చెందినదే బి.ఆర్ ఎస్ పార్టీ జెండా అన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మా పూర్ మండల వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, కరీం నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎలుక అనిత ఆంజనేయులు, గ్రామ సర్పంచ్ బోయి ని కొమురయ్య, ఉపసర్పంచ్ కుంభం శ్రీనివాస్, వార్డు సభ్యులు బొంగాని రజిత, రమేష్ గౌడ్, కో-ఆప్షన్ సభ్యులు బీరం మహేశ్వరి లతో పాటు పార్టీశ్రేణులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News