Friday, September 20, 2024
HomeతెలంగాణManakonduru: అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, చెక్కుల పంపిణీ

Manakonduru: అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, చెక్కుల పంపిణీ

గ్రామానికీ చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీజ్ ఫండ్ చెక్కుల పంపిణీ

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్, మానకొండూరు ఎమ్మేల్యే డా రసమయి బాలకిషన్ రేషన్ డీలర్ షాప్ ను ప్రారంభించారు.
పర్యటనలో భాగంగా గ్రామానికీ చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీజ్ ఫండ్ చెక్కులను పంపిణీ
చేశారు. అనంతరం ఇటీవల గ్రామానికి చెందిన జేజేల కిష్టయ్య ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, తిమ్మాపూర్ మండల అధ్యక్షలు రావుల రమేష్, గ్రామ సర్పంచ్ మెడి అంజయ్య, ఉప-సర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్, మాజీ ఎంపిపి బూడిద ప్రేమలత-వేణు కుమార్, వార్డు సభ్యులు నార్ల అశోక్, అక్కపెల్లి కొమురయ్య, గుర్రం జగదీష్, బీనపల్లి శ్రీనివాస్, తూముల శ్రీనివాస్, పర్నంధి సంపత్, రైతుబంధు అధ్యక్షులు నాంపల్లి శంకరయ్య తో పాటు ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News