Thursday, September 19, 2024
HomeతెలంగాణManakonduru: ఘనంగా రసమయి జన్మదిన వేడుకలు

Manakonduru: ఘనంగా రసమయి జన్మదిన వేడుకలు

కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, బీ.ఆర్.ఎస్. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్, ఎమ్మెల్యే డా.రసమయి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో బీ.ఆర్. ఎస్.పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా ఛైర్మెన్ జీవి. రామకృష్ణారావు కేక్ కట్ చేసి, రక్తదాన శిభిరాన్ని ప్రారభించగా, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, బీ.ఆర్.ఎస్.పార్టీ శ్రేణులు, అభిమానులు బారీ సంఖ్యలో తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత-దేవేందర్ రెడ్డి, జడ్పిటిసిలు శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ గౌడ్, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ రావుల రమేష్, ఆత్మ కమిటీ చైర్మన్ పాశం అశోక్ రెడ్డి, సర్పంచ్ జక్క ని శ్రీవాణి-రవీందర్ లతో పాటు స్థానిక ప్రజా ప్రతిని ధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

రేణికుంటలో…

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో సోమవారం రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎలుక ఆంజనేయులు ఆధ్వ ర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిమ్మాపూర్ మండల వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎలుక అనిత- ఆంజనేయులు, ముఖ్య నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప- సర్పంచ్ కుంభం శ్రీనివాస్, వార్డు సభ్యులు సంటి సురేష్, బొంగని రమేష్, కో- ఆప్షన్ సభ్యులు, బీరం మహే శ్వరి, కనపర్తి చంద్రశేకర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ల్యాగల బాపురెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు,ల్యాగల దేవేందర్ రెడ్డి, బుర్ర ఆంజయ్య గౌడ్, బొమ్మగాని నారాయణ గౌడ్, కోరేపు చంద్రారెడ్డి, గోనెల రాజు గోనెల సంపతి, సతీష్ పోతుగంటి రమేష్ గోనెల స్వామి చెవుల ఆంజయ్య, తిరుపతి ఎలుక సంతోష్, , బొంగని పర్శరములు, తమ్మనవేని కొమురయ్య, శ్రీనివాస్ యాదవ్, ఖాత రవి,జెల్ల సాయికృష్ణ, లోకిని శేఖర్, కర్ర రాజు, అజయ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News