అతనో సహకార సంఘానికి చైర్మన్, సంఘంలో రైతులకు ప్రతినిధిగా ఎన్నికైన ఆ నాయకుడు ఎవరు ఫోన్ చేసినా ఎత్తరట. అతగాడికి అదేం అలవాటో కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడనే అపవాదు మూటగట్టుకుంటున్నాడు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూర్ (లక్ష్మిపూర్) సింగిల్ విండో చైర్మన్ రైతులను పట్టించుకోవటం లేదట. రైతుల కోసం ఎన్నికైన చైర్మన్ రైతులకు ఏదైనా అవసరం ఉండి ఫోన్ చేస్తే ఫోన్ అసలే లిఫ్ట్ చేయరట. చైర్మన్ సాబ్ పై ఉన్న అపవాదు నిజమేనా అని తెలుసుకునేందుకు తెలుగుప్రభ విలేఖరి గత 15 రోజులుగా చైర్మన్ ను ఫోన్ లో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినా కాంటాక్ట్ లోకి రావటం లేదు. ఇక సామాన్య రైతులకు ఎలా కాంటాక్ట్ లోకి వస్తాడో ఇట్టే తెలిసిపోతోంది.
అందుకే దొర అంటారు
ఇకనైనా అతడు రైతుల ఫోన్ లు ఎత్తి, వారికి అందుబాటులో ఉండి, సమస్యలపై కృషి చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు. గతంలో ఇదే మండలంలోని దేశ వ్యాప్తంగా పేరు గాంచిన గట్టుదుద్దెనపల్లి సొసైటీకి చైర్మన్ గా పని చేసిన ఓ వ్యక్తి కూడా ఎవరి ఫోన్ లు ఎత్తకపోయేవారు. కాలక్రమేణా రైతులు ఆయన సేవలకు రెస్ట్ ఇచ్చారు. ఊటూర్ సొసైటీ చైర్మన్ వైఖరి కూడా ఆయనలాగే ఉందని కొందరు రైతులంటున్నారు. చైర్మన్ ను ఆ గ్రామంలో ముద్దుగా దొర అని పిలుచుకుంటారట. “మా దొర ఎవ్వల ఫోన్ లు ఎత్తరు..ముఖ్యమైన వారి ఫోన్ లు మాత్రమే ఎత్తి మాట్లాడుతార”ని కొందరంటున్నారు. ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకుంటే అత్యవసరం ఉన్న రైతులు దొర ఇంటికెళ్ళి కలుస్తారట. ఇకనైనా చైర్మన్ లో మార్పు రావాలని రైతులు కోరుకుంటున్నారు.