Saturday, July 6, 2024
HomeతెలంగాణManchireddy: హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు...

Manchireddy: హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు

ప్రతీ ఇంట్లో ఏదో ఒక సంక్షేమం అందుతుందని, ప్రతీ ఒక్క గడపకు కేసీఆర్ ప్రభుత్వ పథకం చేరుతుంది

- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. సంక్షేమ సారధి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని వైష్ణవి గార్డెన్స్ లో నియోజకవర్గ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో నిర్వహించిన తెలంగాణ సంక్షేమ సంబరాల సభలో కలెక్టర్ హరీష్ తో కలిసి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని, ప్రతీ ఇంట్లో ఏదో ఒక సంక్షేమం అందుతుందని, ప్రతీ ఒక్క గడపకు కేసీఆర్ ప్రభుత్వ పథకం చేరుతుందని అన్నారు. నియోజకవర్గంలో ప్రతీ నెల 6,91,03,000 రూపాయల వివిధ రకాల పెన్షన్లు(వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత కార్మికుల మొదలైనవి) అందుతున్నాయని, గత తొమ్మిది సంవత్సరాలలో 452.52 కోట్ల రూపాయల పెన్షన్లు అందాయని అన్నారు. నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలు కళ్యాణలక్ష్మీ – షాదిముబారక్, ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా లబ్ది పొందారని అన్నారు. అనంతరం నియోజకవర్గానికి చెందిన 100మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ – షాది ముబారక్ చెక్కులు, 6మంది బీసీలకు కులవృత్తి సాయం చెక్కులు, 3మందికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ స్కీమ్ చెక్కులు, 3మంది విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సాయంగా అంబెడ్కర్ ఓవర్ సిస్ స్కాలర్ షిప్ చెక్కులు(20లక్షల చొప్పున) మరియు ఆసరా పింఛన్లు అందజేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తాపూర్ చెంద్రయ్య, ఎంపిపిలు కృపేష్, నర్మదా, జడ్పిటిసీ జంగమ్మ, ఎమ్మార్వోలు, ఎంపిడిఓలు, భారీ ఎత్తున లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News