ఇబ్రహీంపట్నంలో బిఆర్ఎస్ భారీ ర్యాలీలో జరిగిన రాళ్ల దాడిలో బిఆర్ఎస్ కార్యకర్తలకు గాయలవడం తనను తీవ్రంగా కలచివేసిందని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. నామినేషన్ దాఖలు చేసినా అనంతరం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నామినేషన్ ర్యాలీలో జరిగిన ఘటనలో 36 మంది బిఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయని, కాంగ్రెస్ శ్రేణులంతా కుట్రపూరితంగా, బిఆర్ఎస్ కార్యకర్తలపై ఒక్కసారిగా రాళ్లదాడితో విరుచుకుపడ్డారని అన్నారు. ఎక్కడ ఓడిపోతామో అన్న భయంతో ఇలా చేశారని, దాడులకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, దాడులకు భయపడే వాడికి కాదని, నాపై 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారని, మా పార్టీ ర్యాలీకి వచ్చిన జనాన్ని చూసి ఓర్వలేకే మా కార్యకర్తలపై పాల్పడ్డారని తెలిపారు. ఎన్నికల్లో గెలుపు ద్వారానే సమాధానం చెప్తామని, సంవత్సరాలుగా శాంతియుతంగా ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఇలాంటి భయంకరమైన రాళ్లదాడులు జరగడం బాధాకరమని, దాడిలో గాయపడ్డ మా ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటానని తెలిపారు.