తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చెరువుల పండుగ సందర్భంగా యాచారం మండలంలోని చింతపట్ల గ్రామంలో చెరువు వద్ద నిర్వహించిన చెరువుల పండుగ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. గ్రామ మహిళలు ఘనంగా నిర్వహించిన బతుకమ్మ, బోనాలు ఉత్సవాలలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నీటి కరువు ప్రాంతంగా ఉండేదని, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా నియోజకవర్గంలోని దాదాపు చెరువులు నిండుకుండలా మారాయని అన్నారు. మిషన్ కాకతీయ 4 విడతల్లో 421 కోట్ల రూపాయలతో పూడికతీతలే ఈ చెరువులు నిండటానికి కారణమని ఆయన చెప్పుకొచ్చారు. చింతపట్ల చెరువు కట్ట విస్తరణ కోసం 10లక్ష రూపాయలను ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మంజూరు చేయగా గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర స్థాయి టౌర్నమెంట్స్ లో విజయం సాధించిన వాలీబాల్ టీం మెంబర్ చింతపట్లకు చెందిన శివానిని ఎమ్మెల్యే సత్కరించి, ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Manchireddy: చింతపట్లలో ఘనంగా చెరువుల పండుగ
బతుకమ్మ, బోనాలు ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే