Saturday, November 15, 2025
HomeతెలంగాణManchireddy files nomination: గులాబీమయమైన ఇబ్రహీంపట్నం

Manchireddy files nomination: గులాబీమయమైన ఇబ్రహీంపట్నం

కార్యకర్తలు ఉత్సాహంతో హోరెత్తింది

కన్నులపండువగా జరిగిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం సాగింది. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి, నామినేషన్ వేసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి..30 వేల మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కని – వినీ ఎరుగనిరీతిలో శాస్త్ర గార్డెన్స్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు.

- Advertisement -

5 కిలోమీటర్ల దూరం వరకు ఇసుకేస్తే రాలనంత కార్యకర్తలు తరలిరావడంతో గెలుపు ధీమా వ్యక్తంచేశారు. డప్పు-దరువులతో యువత కేరింతలు కొడుతూ…బతుకమ్మ, బోనాలతో మహిళా కార్యకర్తలు ఉత్సాహంతో హోరెత్తి పోయింది. ర్యాలీ అనంతరం నామినేషన్ వేసిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad