Saturday, November 15, 2025
HomeతెలంగాణManchireddy: ధైర్యంగా చెప్పుకుందాం

Manchireddy: ధైర్యంగా చెప్పుకుందాం

అభివృద్ధి చేశాం.. ప్రజలకు మేలు చేశాం

నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశామని జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా సంక్షేమ పథకాలు అమలు చేసిందని చెప్పారు. చేసిన అభివృద్ధిని, జరిగిన మంచిని ధైర్యంగా ప్రజలకు చెప్పుకుందామని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

మనకంటే గొప్పగా ఇతర పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని, అందుకే వారు మనల్ని తిట్టడంమొకటే పనిగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. మండల, మున్సిపల్ అధ్యక్షులు, కార్యదర్శులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad