Saturday, November 23, 2024
HomeతెలంగాణManchiryala: మైనింగ్ రంగంలో సవాళ్లను అవకాశంగా మార్చుకొని సాగాలి

Manchiryala: మైనింగ్ రంగంలో సవాళ్లను అవకాశంగా మార్చుకొని సాగాలి

2%-4% జిడిపికి మైనింగ్ రంగం ఎదగాలి

మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్ లో ఎన్ఎండిసి చైర్మన్, ఎండి అమితవ ముఖర్జీ పాల్గొన్నారు. భారతదేశంలో నేడు మైనింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను ఇంజనీర్లు మంచి అవకాశాలుగా మార్చుకోవాలని, తద్వారా దేశ జిడిపి ఎదుగుదలకు సహకరించాలని ఎన్.ఎం.డి.సి చైర్మన్ మరియు ఎండి అమితవ ముఖర్జీ పిలుపునిచ్చారు.
హైదరాబాదులోని ఎన్.ఎం.డి.సి సమావేశ మందిరంలో జరిగిన మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ వారి జనరల్ బాడీసమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. దేశంలో గుర్తించబడిన మైనింగ్ నిలువలు 22 శాతం ఉండగా వీటిలో సమగ్ర అన్వేషణ జరిగినవి కేవలం 6% మాత్రమేనని, వీటిలో ప్రస్తుతం మైనింగ్ జరుగుతున్నది రెండు శాతం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. భారతదేశం అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తున్న ఈ తరుణంలో ఈ రెండు శాతాన్ని రెట్టింపు చేస్తే జిడిపికి మైనింగ్ రంగం నుండి నాలుగు శాతం వృద్ధి చేకూరుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైనింగ్ పరిశ్రమలను అధ్యయనం చేసిన ఫెజర్ ఇన్స్టిట్యూట్ వారు అత్యుత్తమ 100 పరిశ్రమల జాబితాను రూపొందించగా దానిలో భారత్ కు స్థానం లేకపోవడం ఆలోచించాల్సిన విషయం అన్నారు. మైనింగ్ రంగాన్ని మరింతగా అభివృద్ధి పరచాల్సిన బాధ్యత ఇంజనీర్ల పై ఉందని పేర్కొన్నారు నేటి పరిస్థితుల్లో పర్యావరణ హితంగా మైనింగ్ జరపాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు, మొక్కలు నరకడం కాదని వాటిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మూతపడిన గని ప్రాంతాలను పూర్వస్థితికి తీసుకురావాలని పచ్చదనాన్ని వృద్ధి చేయాలన్నారు. మైనింగ్ పట్ల ప్రజలకు గల ద్వేష భావాన్ని పోగొట్టాలంటే బాధ్యతాయుత మైనింగ్ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. అందుకే తమ ఎన్ఎండిసి సంస్థ బాధ్యతాయుత మైనింగ్ సంస్థ అనే పేరు కూడా చేర్చుకొని అందుకు తగిన విధంగా తక్కువ విద్యుత్తును తక్కువ నీటిని వినియోగిస్తూ ముందు పోతున్నామన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జాతీయస్థాయి మాజీ అధ్యక్షులు ఎండి ఫషీయుద్దీన్, విడి.రాజగోపాల్, ఎమ్.ఇ.ఈ.ఐ సెక్రటరీ జనరల్ నరసయ్య , హైదరాబాద్ చాప్టర్ మాజీ అధ్యక్షులు బి.ఆర్.వి సుశీల్ కుమార్,ఎన్ఎండిసి డైరెక్టర్ టెక్నికల్ వినయ్ కుమార్, డైరెక్టర్ కమర్షియల్ విశ్వనాథ్ సురేష్, డైరెక్టర్ ప్రొడక్షన్ దిలీప్ కుమార్ మహంతి ప్రసంగించారు.. కొత్త కమిటీ చైర్మన్ గా వినయ్ కుమార్ ఈ జనరల్ బాడీ సమావేశంలో కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగిందని ప్రస్తుత కమిటీ సెక్రటరీ బీ.మహేష్ వివరాలను తెలియజేశారు. కొత్త కమిటీకి అధ్యక్షుడిగా వినయ్ కుమార్ ఎన్.ఎం.డి.సి డైరెక్టర్ టెక్నికల్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఎమ్మెస్ వెంకట్రామయ్య, కార్యదర్శిగా ఎల్ కృష్ణ, జాయింట్ సెక్రెటరీగా వి.బాలకోటి రెడ్డి కోశాధికారిగా డాక్టర్ ఎస్ కే సింహం ఎంపికయ్యారు. మరో తొమ్మిది మంది కౌన్సిల్ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి డాక్టర్ ఎమ్మెస్ వెంకట్రామయ్య స్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News