కాంట్రాక్టు ఎఎన్ఏంలు చేస్తున్న సమ్మె ఆగదని తెలిసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సీఐటీయు సంఘ ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ ఊపందుకుంది. తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయు జిల్లా గౌరవ అధ్యక్షులు దుంపల రంజిత్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు అందరూ సమ్మెబాట పట్టారు. పూర్తిస్థాయిలో వారిని రెగ్యులర్ చేయాలని, నోటిఫికేషన్ రద్దు చేయాలని చేస్తున్న పోరాటం నేటికీ 16వ రోజుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి కాంట్రాక్ట్ ఎఎన్ఏంల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయు జిల్లా అధ్యక్షురాలు పద్మ, సరిత, పద్మ, సత్యవతి, రాజమణి, రమ, లలిత రాణి పాల్గొన్నారు.