Friday, April 11, 2025
HomeతెలంగాణManchiryala: బిఆరెస్ వీడి బీజేపీ గూటికి అరవింద్ రెడ్డి?

Manchiryala: బిఆరెస్ వీడి బీజేపీ గూటికి అరవింద్ రెడ్డి?

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో అనేక ఉద్యమాలలో పాల్గొన్న ఉద్యమకారుడు, మంచిర్యాల జిల్లా వాస్తవ్యులు మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు తన అనుచరులతో రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. స్థానికంగా ప్రస్తుతం అధికారంలో ఎమ్మెల్యేగా గెలవడానికి ఎన్నోసార్లు సహాయం అందించ్చినట్లు విశ్వానియా వర్గాలు చెప్పకనే చెబుతున్నాయి. విలువ ఇవ్వని దగ్గర ఉండటం మన మంచిది కాదని ఇప్పుడు తెలుసుకున్న బిఆరెస్ నేత త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ ఆవిర్భావం 2001 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చురుకైన నాయకునిగా ఉండి తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో ప్రత్యేక భూమిక పోషించారు. 2009 లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, 2010 ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని ఎప్పుడూ కాపాడుకుంటూ వస్తున్న తనకు ఇక బిఆరెస్ లో ఎటువంటి స్థానం ఉండటం లేదని తెల్సి మరికొద్ది రోజుల్లోనే దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో బీజేపీ పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News